Sunday, November 17, 2024

Doctors creats histry-: వైద్యరంగంలో సంచలనం.. వెన్నెముకతో తలను అతికించిన డాక్టర్ల బృందం

వైద్య రంగంలోనే ఇజ్రాయెల్ వైద్యులు అద్భుతాన్ని సృష్టించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ బాలుడికి తిరిగి ప్రాణదానం చేశారు. వెన్నెముక నుంచి విడిపోయిన తలను మళ్లీ జతపరిచి అతడిని కోలుకునేలా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జోర్డాన్ వ్యాలీకి చెందిన సులేమాన్ హసన్(12) గతేడాది తన ఇంటి వద్ద సైకిల్ తొక్కుతుండగా కారు ఢీకొట్టింది. దీంతో, తల, వెన్నెముక కలిసే చోట లిగమెంట్లు తెగిపోవడంతో అంతర్గతంగా తల, వెన్ను వేరయ్యాయి. చికిత్స కోసం అతడిని జెరూసలేంలోని ఈన్ కెరెమ్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు బాలుడి పరిస్థితి చూసి తొలుత షాకైపోయారు. కానీ, దాన్నో సవాలుగా స్వీకరించి రంగంలోకి దిగారు. తొలుత అతడి తల వెన్నెముక తిరిగి జత చేసేందుకు ఆపరేషన్ చేశారు.

ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న స్పెషలిస్టు వైద్యులు, నర్సులు కొన్ని గంటల పాటు కష్టపడి ఆపరేషన్ పూర్తి చేశారు. కొత్త కణాలు, నాడులను తిరిగి జోడించడంలో తాము పడ్డ కష్టం మాటల్లో వర్ణించలేమని వైద్యులు చెప్పారు. ఏడాది క్రితం ఈ ఆపరేషన్ జరగ్గా హసన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. దీంతో, అతడిని డిశ్చార్జ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రామా సిబ్బంది త్వరితగతిన స్పందించారని వైద్యులు ప్రశంసించారు. అప్పుడు వారు తీసుకున్న చర్యలు బాలుడు తిరిగి కోలుకోవడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. హసన్ పూర్తి స్థాయిలో కోలుకోవడం ఓ అద్భుతమని వైద్యులు తెలిపారు. ఇలాంటి ప్రమాదాల్లో బాధితులకు మెదడు సంబంధిత సమస్యలు వస్తాయని చెప్పారు. హసన్ మాత్రం ఎలాంటి సమస్యా లేకుండా యాక్సిడెంట్ పూర్వపు స్థితికి చేరుకున్నాడని అన్నారు. కాగా, ఈ సందర్భంగా సులేమాన్ తండ్రి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. తన కొడుకును రక్షించినందుకు నా జీవితాంతం కృతజ్ఞతతో ఉంటానని అతడు తెలిపాడు అని ఇజ్రాయెల్ అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement