రహదారిలో సంభవించిన ప్లాష్ ప్లడ్స్ కి ఓ కారు కొట్టుకుపోయింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసోంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్డుపై నుంచి జోరుగా పారుతున్న వరద నీటిని దాటుకుంటూ నెమ్మదిగా అటువైపు వెళ్తున్న స్కార్పియో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి కిందనున్న లోయలో పడిపోయింది. చిపుత గ్రామంలో సంభవించిన ఫ్లాష్‌ఫ్లడ్స్ కారణంగా ఈ ఘటన జరిగినట్టు వీడియోను షేర్ చేసిన ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ పేర్కొంది. గత కొన్ని రోజులుగా ఈ ఈశాన్యరాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు, కుండపోత వానలతో దేశంలోని పలు ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. నిన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ మోకాలి లోతు నీరుతో చెరువులను తలపించాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement