హైదరాబాద్ హసన్ నగర్లో దారుణం జరిగింది. ఇవ్వాల (బుధవారం) రాత్రి బహదూర్‌పురా ఏరియాలోని ఓ హోటల్ ముందు రౌడీషీటర్ బాబూఖాన్ని నరికి చంపేశారు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో అటాక్ చేశారు. దీంతో స్పాట్లో బాబూఖాన్ ప్రాణాలు వదిలేశాడు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి బహదూర్ పురా పోలీసులు చేరుకున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు.
కాగా, బాబూఖాన్ పై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ అయినట్టు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ మర్డర్ జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్ లను రంగంలోకి దింపారు. మర్డర్ ప్లేస్‌లో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.