ఓ ఆర్గానిక్ రెస్టారెంట్ ని ప్రారంభించేందుకు గెస్ట్ గా ఆవుని తీసుకెళ్లారు..ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో చోటు చేసుకుంది.లక్నోలో తొలి ఆర్గానిక్ రెస్టారెంట్‌ను మాజీ డీఎస్పీ శైలేంద్ర సింగ్ నడపాలని అనుకున్నారు. సుశాంత్ గోల్ఫ్ సిటీలో లులూ మాల్ పక్కనే శైలేంద్ర సింగ్ తన ఆర్గానికి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్‌ను ఓ గోవుతో ప్రారంభించాలనే ఆలోచన చేశారు. అనుకున్నట్టే ఓ గోవును రెస్టారెంట్‌కు తీసుకువచ్చారు.ఆ గోవును పసుపు వర్ణం గుడ్డతో కప్పారు. దానికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఆ గోవును రెస్టారెంట్‌లోకి తీసుకెళ్లారు. ఆ ఆర్గానిక్ రెస్టారెంట్ పేరు ఆర్గానిక్ ఒయాసిస్. ఆర్గానిక్ సాగుతో పండించిన పంటతో ఇక్కడ ఆహారం ప్రిపేర్ చేస్తారు. ఈ రెస్టారెంట్‌ను గోవుతో ప్రారంభింపజేయడంతో ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సాధారణంగా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్, ఇతర వాణిజ్య సముదాయాలను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు, స్థానికంగా పలుకుబడిన కలిగిన వారిని పిలుస్తారు. వారి చేత వాటిని ఓపెనింగ్ చేయిస్తుంటారు.కానీ ఆవుతో చేయించడం విశేషం.
Advertisement
తాజా వార్తలు
Advertisement