గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమై అంతకు మించి విజయమార్గంలో దూసుకుపోతోంది. ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో ఎంపీ సంతోశ్ కుమార్ ప్రారంభించారు.కాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. సామాజిక సేవా విభాగంలో ఒక గంటలో అత్యధిక మొక్కలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ కార్యక్రమ సృష్టికర్త, ఎంపీ సంతోశ్ కుమార్‌కు చోటు కల్పించినట్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ వత్సల కౌల్బెనర్జీ తెలిపారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసా పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఎంపీ సంతోశ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగమై.. ఈ రికార్డు సాధించడానికి కారణమైన మాజీ మంత్రి జోగు రామన్నకు సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. జోగు రామన్న తన పుట్టిన రోజు సందర్భంగా 2021లో జులై4న 16,900 మంది సాయంతో 3,54,900 మొక్కలు నాటించారని తెలిపారు. మరోవైపు సమష్టి కృషి, సామాజిక స్పృహకు ఈ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement