Friday, November 22, 2024

క‌ర్ణాట‌క‌లో స్కూల్స్ రీ ఓపెన్ – మ‌రోసారి తెర‌పైకి హిజాబ్ వివాదం

నేటి నుంచి క‌ర్ణాట‌క‌లో పాఠ‌శాల‌లు పునఃప్రారంభ‌మ‌య్యాయి, దాంతో మ‌ళ్లీ హిజాబ్ వివాదం ప్రారంభ‌మ‌యింది. హిజాబ్ ధ‌రించి పాఠ‌శాల‌లోకి ప‌లువురు విద్యార్థులు వ‌చ్చారు. దాంతో విద్యార్థినుల త‌ల్లిదండ్రులు ఉపాధ్యాయురాలితో గొడ‌వ‌పెట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న మాండ్యలోని రోట‌రీ స్కూల్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. పాఠ‌శాల‌లోకి అడుగు పెట్టేముందే హిజాబ్ తీసేయాల‌ని ఉపాధ్యాయురాలు చెప్పింది. దీంతో చివ‌ర‌కు హిజాబ్ తీసేసి విద్యార్థినులు పాఠ‌శాల‌లోకి వెళ్లారు. హిజాబ్‌తోనే పాఠ‌శాల‌లోకి అనుమ‌తించాల‌ని ఉపాధ్యాయురాలిని త‌ల్లిదండ్రులు వేడుకున్న‌ప్ప‌టికీ ఆమె వినిపించుకోలేదు. కాగా, హిజాబ్ అంశం ప్ర‌స్తుతం కోర్టు ప‌రిధిలో ఉన్న విష‌యం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement