ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది. ఈ భూకంపంతో సుమారు 950 మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఆగ్నేయ నగరం ఖోస్ట్‌కు 44కిమీ (27 మైళ్లు) దూరంలో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశంలోని 500 కి.మీల కంటే ఎక్కువ దూరం ప్రకంపనలు సంభవించాయని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ పేర్కొంది.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌తో పాటు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కూడా భూకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం సంభవించడం వల్ల ఇళ్లు కూలిపోవటంతో శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు రక్షణ సిబ్బంది చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.