బర్త్ డే వేడుకలో ఓ వ్యక్తి ఎంతో ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్స్ చేస్తున్న మనిషి సడెన్ గా కుప్పకూలిపోయాడు. దీంతో అంతా షాక్ కి గురయ్యారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. డ్యాన్స్ చేస్తుండగానే అతడికి హార్ట్ ఎటాక్ వచ్చిందని.. దీంతో అక్కడికక్కడే చనిపోయాడని డాక్టర్లు వెల్లడించారు. కొన్ని రోజులుగా ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడం ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నవయసు వారే ఊహించని విధంగా మరణిస్తుండడం విషాదం నింపుతోంది. బర్త్ డే పార్టీకి హాజరైన ఓ వ్యక్తి బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తున్నాడు. పాటకు తగ్గట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నాడు. కాసేపు అలానే డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. చప్పట్లు కొడుతూ అతడిని అంతా ప్రోత్సహిస్తున్న వేళ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అందరూ వచ్చిలేపినా లేవలేదు. కంగారుపడి చూడగా చలనం లేకుండా పోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని డాక్టర్లు చెప్పడం మైండ్ బ్లాంక్ చేసింది. సడెన్ గా కుప్పకూలిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా కూడా మరణం వస్తుందా అని అంతా షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది.ఉత్తరప్రదేశ్ లోని బారెల్లీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement