ప్రేమకోసం సరిహద్దులు దాటి వస్తున్న వారి గురించి ఈ మధ్య కాలంలో వింటూనే ఉన్నాం.. విదేశాల మధ్య ప్రేమకథలు ఎక్కువగా వార్తల్లో వస్తున్నాయి. ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్, పాకిస్థాన్ వెళ్లిన రాజస్థాన్ కు చెందిన అంజు ఇప్పటికే వార్తల్లో నిలిచారు. వీటన్నింటి మధ్య దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి.. తన ప్రియుడి కోసం భారత్‌కు వచ్చింది. భారతీయ మూలానికి చెందిన తన ప్రేమికుడిని వివాహం చేసుకోవడానికి దక్షిణ కొరియా నుండి భారతదేశానికి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుఖ్‌జిత్ సింగ్ కొరియాలోని బుసాన్‌లోని ఓ కాఫీ షాప్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న కిమ్ బోతో ప్రేమలో పడింది. వీరిద్దరూ నాలుగేళ్లు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత సుఖ్‌జిత్ ఈ మధ్యనే భారత్ తిరిగొచ్చాడు. వచ్చిన రెండు నెలల తర్వాత కిమ్ కూడా ఇండియా వచ్చింది. ఈ జంట సిక్కు సంప్రదాయం ప్రకారం గురుద్వారాలో పెళ్లి చేసుకున్నారు. కాగా, కిమ్ మూడు నెలల వీసాపై భారతదేశానికి వచ్చింది. తాను తర్వాత బుసాన్ వెళతాను అని సుఖ్‌జిత్ చెప్పాడు.
భారత్‌కు వచ్చిన దక్షిణ కొరియా యువతి పంజాబీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా పుయాన్‌లోని గురుద్వారా నానక్ బాగ్‌లో ఈ జంట మూడుముళ్లు, ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. సుఖ్‌జిత్‌సింగ్ ఓ కాఫీ షాప్‌లో పనిచేస్తుండగా.. బిల్లింగ్ కౌంటర్‌లో పనిచేస్తున్న కిమ్ బోహ్‌ని(30)తో పరిచయం ఏర్పడింది. కొద్ది నెలల్లోనే కొరియన్ భాష నేర్చుకోవడం ద్వారా తనకు, బోహ్ నీకి మధ్య ఉన్న భాషా అవరోధాన్ని తాను అధిగమించానని సింగ్ చెప్పాడు. పెళ్లికి ముందు ఈ జంట నాలుగేళ్లు కలిసి జీవించారు.
అయితే, ఇంతలో సుఖ్ జీత్ స్వస్థలానికి వెళ్లాడు. సుఖ్ జిత్ ఇంటికి వచ్చి ఆరు నెలలైంది. అతడు లేకపోవడం తట్టుకోలేక విమానంలో బయల్దేరి ఢిల్లీ వచ్చేసింది ఆ యువతి. అక్కడి నుంచి నేరుగా షాజహాన్ పూర్ లోని సుఖ్ జీత్ ఇంటికి వెళ్లింది. కిమ్‌ని చూడగానే తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కిమ్ మాట్లాడుతూ.. తాను నాలుగు నెలల్లో భాషా సమస్యను అధిగమించి కొరియన్ నేర్చుకున్నానని చెప్పాడు. తమ ఇరువురి కుటుంబాల అనుమతితో 4 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. అయితే, సుఖ్ జిత్ తల్లి మాత్రం తన కొడుకు, కోడలు ఇండియాలోనే ఉండాలని కోరుకుంటోంది. కానీ, కొన్ని అవాంతరాలు ఏర్పడుతుండడంతో ఇది వారి జీవితం, వారి ఇష్టమని తెలిపింది. వారు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా అంటూ చెప్పింది.