ఓ కారులో ప్రయాణిస్తున్న వారిపై చిరుత బీభత్సం సృష్టించి దాడి చేసిన ఘటన అసోంలోని జోర్హాట్ లో చోటుచేసుకుంది. అడ్డుగా ఉన్న కంచె పైనుంచి ఎగిరి దూకిన చిరుత.. కారుపై దాడి చేసి పారిపోవడాన్ని అటవీ శాఖ సిబ్బంది మొబైల్ కెమెరాల్లో బంధించారు. అటవీ ప్రాంతంలోని ఇనుప కంచె దాటి జనావాసాల్లోకి వచ్చిన చిరుత పలువురిపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ చిరుత ఓ వాహనంపై దాడి చేసింది.
చిరుతను పట్టుకునేందుకు వచ్చిన ఫారెస్ట్ సిబ్బందిపైనే అటాక్ చేసింది. కారులో ఉన్న సిబ్బంది తృటిలో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చిరుత దాడి చేసిన ఘటనలో 13మంది గాయపడ్డారు. క్యాంపస్ లో పరుగులు తీస్తూ కనిపించిన వారిపై ఎగబడింది. ఈ ఘటనలో పిల్లలు, మహిళలు, అటవీ అధికారులు సహా.. వీళ్లలో ముగ్గురు అటవీ శాఖ ఉద్యోగులున్నారని జొర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా తెలిపారు. గాయపడ్డ వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.