ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక కాలమానం ప్రకారం 2 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు తెలిపింది. మస్బేట్ ప్రావిన్స్‌లోని మియాగా గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్జీఎస్ వెల్లడించింది. ఈ భూకంపంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వరుస భూకంపాలు ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నాయి. ఇటీవలే తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement