చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని లుండింగ్ కౌంటిలో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 12.25 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. హిందూకుష్ పర్వతాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఉత్తర పాక్‌లోని పలుచోట్ల సైతం భూమి కంపించింది. అయితే భూకంపం కారణంగా నష్టం జరిగినట్లు ఇప్పటికీ ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. టిబెట్‌ను ఆనుకొని ఉన్న సిచువాన్ ప్రావిన్స్‌లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. టిబెటన్ పీఠభూమిలోనూ తరచూ భూకంపాలు నమోదవుతూ ఉంటాయి. భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.