నాగార్జునసాగర్‌లోని నాగార్జున కొండను ఇవ్వాల (ఆదివారం) మైసూరుకు చెందిన బౌద్ధ గురువుల బృందం సందర్శించింది. బుద్ధవనం ప్రాజెక్టు ఆవిష్కరణలో భాగంగా నాగార్జున సాగర్‌కు చేరుకున్న వీరు ఆదివారం మైసూరు బైలకుప్పె కు చెందిన ‘షేరే బౌద్ధారామం ’బుద్ధిష్ట్ మాంక్ గీసే నగ్వాంగ్ జంగ్నే ఆధ్వర్యంలో బౌద్ధ భిక్షువుల బృందం నాగార్జున కొండను సందర్శించారు. ఇందులో భాగంగా నాగార్జునకొండ మ్యూజియం, అక్కడ నిర్మించిన పునర్నిర్మాణ కట్టడాలను వీక్షించారు.
మూడో శతాబ్దం నాటి గౌతమ బుద్ధుని పాల రాతి శిల్పాలను చూసి మధురానుభూతి లోనయ్యారు. ఇక్కడ మ్యూజియంలో భద్రపరిచిన గౌతమ బుద్ధుని ధాతువులను చూసి తలపై పెట్టుకుని తమ జీవితం ధన్యమైంది అన్నారు. వీరితో పాటు బుద్ధవనం ప్రాజెక్ట్ డిజైన్ ఇన్‌చార్జ్ శ్యామ్ సుందర్, స్థానిక గైడ్ సత్యనారాయణ ఉన్నారు