Sunday, November 3, 2024

TS | గిరిజనుల దశాబ్దాల కల సాకారం.. పోడు సమస్యకు కేసీఆర్​ శాశ్వత పరిష్కారం

అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరి పుత్రులకే ఆ భూములపై హక్కులు కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు జూన్ 30వ తేదీ నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అటవీ భూములపై ఆధారపడిన వారికి భూ యాజమాన్య హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని పేర్కొన్నారు. గతంలోనే దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తి చేసిందన్నారు. ఈ మేరకు అత్యధికంగా పొడు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 151195 ఎకరాలకు గాను 50595 మంది గిరిజనులకు స్వయంగా మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ పట్టాలు అందించనున్నారని మంత్రి సత్యవతి వెల్లడించారు.

రెండో స్థానంలో అత్యధికంగా పోడు భూములున్న మహబూబాబాద్ జిల్లాలో 67730 ఎకరాలకు గాను 24181 మంది పోడు రైతులకు మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ పట్టాలు అందించనున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 47138 ఎకరాలకు గాను 15519 మందికి ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా పోడు పట్టాలను అందించనున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అదే రోజు పోడు భూముల పట్టాలు నియోజకవర్గాల వారీగా కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సమక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు అందించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఆదిలాబాద్ లో 31683 ఎకరాలకు గాను 12222 పోడు రైతులకు పట్టాలు అందించనున్నారు. నిర్మల్ జిల్లాలో 20051 ఎకరాలకు 7275 పొడు రైతులు, ములుగు జిల్లాలో 18460 ఎకరాలకు గాను7129 మందికి, ఖమ్మంజిల్లాలో 12470 ఎకరాలకు గాను 6598 పొడు రైతులకు, కామారెడ్డి జిల్లాలో 11347 ఎకరాలకు 5015 మందికి, నిజామాబాద్ 8611 ఎకరాలకు 4229 మందికి పట్టాలు అందించనున్నారు. వరంగల్ 73333 ఎకరాలకు గాను 4271 మందికి , మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 8088 ఎకరాలకు గాను 3250 పోడు రైతులకు పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

- Advertisement -

నల్గొండ జిల్లాలో 5578 ఎకరాలకు గాను 2928 పొడు రైతులకు, మంచిర్యాల జిల్లా 5024 ఎకరాలకు గాను 2403 పొడు రైతులకు, నాగర్ కర్నూలు జిల్లాలో 5056 ఎకరాలకు గాను 1973 మంది పోడు రైతులకు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2859 ఎకరాల గాను 1614 పోడు రైతులకు, సంగారెడ్డి జిల్లాలో 1808 ఎకరాల గాను 1127 పోడు రైతులకు, మెదక్ జిల్లాలో 525ఎకరాలకు గాను 610 పోడు రైతులకు, వికారాబాద్ జిల్లాలో 553 ఎకరాలకు గాను 436 పోడు రైతులకు వనపర్తి జిల్లాలో 455 ఎకరాలకు గాను 389 పోడు రైతులకు పట్టాలు అందననున్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లాలో213 ఎకరాల గాను 205 పోడు రైతులకు, సూర్యాపేట జిల్లా 84 ఎకరాలకు గాను 84 పోడు రైతులకు, హనుమకొండ జిల్లాలో 65 ఎకరాలకు గాను 70 పోడు రైతులకు, మహబూబ్ నగర్ జిల్లాలో 13 ఎకరాలకు గాను 19 పోడు రైతులకు, జగిత్యాల జిల్లాలో20 ఎకరాల గాను 15 పోడు రైతులకు, పెద్దపల్లి జిల్లాలో 2 ఎకరాల గాను 4 పోడు రైతులకు, నారాయణపేట జిల్లాలో 8 ఎకరాలకు గాను 3 మూడు రైతులకు పట్టాలను అందించనున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలియజేశారు. వీరికి పట్టాలు ఇవ్వనుండడంతో రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించనున్నాయని మంత్రి సత్యవతి పేర్కొన్నారు. కొత్తగా పోడు పట్టాలు పొందిన వారికి రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలను తెరిచి, పోడు పట్టాల యాజమానులకు నేరుగా రైతుబంధును జమ చేస్తామని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement