కరోనా బారినపడి వారి ప్రాణాలు రక్షించడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు వైద్యసిబ్బంది. ఆస్పత్రులకు రోగుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతుండటంతో వారికి బెడ్లు సమకూర్చడం నుంచి చికిత్స అందించడం వరకు ప్రతిదీ తలకు మించిన భారంగా మారిపోయింది. దాంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే పలు ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది మధ్యధ్య గొడవలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా ఆస్పత్రిలో డాక్టర్ కు, నర్సుకు మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి సహనం నశించిన నర్సు డాక్టర్ చెంపపై గట్టిగా కొట్టింది. దాంతో డాక్టర్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఘటనపై రాంపూర్ సిటీ మెజిస్ట్రేట్ రామ్ జీ మిశ్రా ఇద్దరిని వేర్వేరుగా విచారించారు. తాను కొట్లాడుతున్న డాక్టర్, నర్సు ఇద్దరితో విడివిడిగా మాట్లాడానని, ఇద్దరూ కూడా పని ఒత్తిడిని తట్టుకోలేకనే తాము సహనం కోల్పోయామని చెప్పారని తెలిపారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.