– కపిల్ సిబల్, సీనియర్ న్యాయవాధి, రాజ్యసభ సభ్యుడు
ముద్రిత అక్షరం, ఒక కళారూపం… కదిలేబొమ్మల కన్నా తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఆ కదిలే బొమ్మలు ఉద్వోగం కలిగించేవిగాను, కనుల విందు చేసేవిగాను ఉంటాయి. కథలు వాస్తవాలైనా, కల్పితాలైనా వివాదాల చుట్టూ తిరుగుతాయి. ఒక్కోసారి ఆలోచనలు రేకిత్తించే చర్చలు మనసులను ఆకర్షిస్తాయి. కదిలే బొమ్మలు ఒక కథను చెబుతాయి. కల్పితం చుట్టూ అల్లిన ఇప్పటి వరకూ వినని కథను చెబుతాయి. ఈ కథను సినిమాగా చూపడంలో ఉపదేశం చెప్పడానికి లేదా తప్పుదారి పట్టించడానికి లేదా ప్రచారాస్త్రంగానూ భావించవచ్చు. ఇదంతా, ఇప్పుడు వాక్ స్వేచ్ఛ పేరిట జరుగుతున్న చర్చ కూడా అలాంటి వాక్ స్వేచ్ఛ. దేశంలో ప్రతిపౌరునికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అనేది కూడా అలాంటిదే. అయితే, స్వేచ్ఛగా మాట్లాడటంతో పాటు ఏదీ సంపూర్ణమైన హక్కు కాదు.
కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ చిత్రాలు సైద్ధాంతికంగా జనాన్ని భద్రత భ్రమింపజేసి ప్రేక్షకులను ఆకర్షించాయి. ఈ సినిమా కళ దుర్వినియోగం చేయబడింది. ఈ చిత్రాలను ఎన్నికల ముహూర్తాలు చూసుకుని విడుదల చేశారు. దీనిపై తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
కేరళస్టోరీ కర్నాటక ఎన్నికల పోలింగ్ కి ముందు విడుదల చేశారు. కేరళలో హిందువులు, క్రైస్తవ మహిళల వేధింపుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇస్లాం మతాన్ని స్వీకరించమని ఒత్తడి తేవడం, ఆ తర్వాత ఐఎస్ఐలో చేరమని ప్రేరేపించడం ఈ చిత్ర కథా ఇతివృత్తం. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి, ఓ సామాజిక వర్గంపై ద్వేషాన్ని ప్రకోపింపజేయడం, ఉగ్రవాదులకు తోడ్పడే రీతిలో కుట్రపూరితంగా మహిళలను మతం మార్చుకోమని పురికొల్పడం ఈ కథ ఇతి వృత్తం.
బలవంతపు మత మార్పిడిల వల్ల కేరళలో 32 వేల మంద మహిళలు బాధితులయ్యారని నిర్మాతలు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని టీజర్లో చూపించారు. కేరళ హైకోర్టులో దీనిని సవాల్ చేసినప్పుడు, ఈ చిత్రం టీజర్ని తొలగించడానికి నిర్మాతలు వెంటనే అంగీకరించారు. అయితే, ఇది జరిగిన ఘటనల ఆధారంగా తీసిన చిత్రమనీ, కేరళలో మూడు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు మహిళలు ఈ మాదిరి ఒత్తిడిలకు లోనై మతం మార్చుకున్నారని నిర్మాతలు పేర్కొన్నారు. కేరళ హైకోర్టు ఈ చిత్రంలోని అంశాలను కనీసం చూడకుండా ఈ చిత్రం దేనిని ప్రచారం చేయడం కోసం నిర్మించారో నిర్ధారించుకోకుండా ఈ చిత్రం ప్రదర్శనపై నిషేధానికి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడానికి నిరాకరించింది. న్యాయవ్యవస్థ ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా, కల్పిత గాథలతో సమాజాన్ని చీల్చే అజెండాతో నిర్మించిన చిత్రాల విషయంలో మరింత జాగరూకతతో ఉండాలి. ముఖ్యంగా జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చూడాలి.
ముందుగా న్యాయమూర్తులు ఈ చిత్రంలోని వివరాలను, తీరును, ఇతివృత్తం నాణ్యతను పరిశీలించాలి. ఇంతకుమించి సరైన విధానం మరొకటి లేదు. వాక్ స్వేచ్ఛ సంపూర్ణమైనదని గ్రహించాలి. ఒక వేళ అది ప్రాథమిక హక్కు అయినప్ప టికీ, ఆది సహేతుకమైన ఆంక్షలకు లోబడి ఉండాలి. అవేమిటంటే, దేశం భద్రత, విదేశాలతో స్నేహపూర్వకమైన సంబంధాలు, ప్రజావ్యవస్థ నైతికత, హుందాతనం, కోర్టు ధిక్కరణ, పరువునష్టం మొదలైనవి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. దేశ సార్వభౌమాధికారానికి సమైక్యతకు భంగకరం కాకుండా చూడాలి.
ఏ న్యాయమూర్తి చిత్రాన్ని చూడకుండా ఉత్తర్వులు జారీ చేయకూడదు. చిత్రం ఇతివృత్తం తెలుసుకోకుండా ఆదేశాలు జారీ చేస్తే వెలకట్టలేని హాని జరుగుతుంది. నష్టం జరుగుతుంది. ఉద్దేశ్య పూర్వకంగా ఆ చిత్రంలోని మంచి చెడులను గుర్తించకుండా నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు.. సంభాషణలు అంతర్లీనంగా, ఉద్దేశపూర్వకంగా ప్రజల మధ్య చీలిక తెచ్చేలా ఉన్నాయి. అలాంటి కొన్ని సన్నివేశాలు, సంభాషణలను ఉదహరిస్తాను. ఒక సన్నివేశంలో ముస్లిం మత పెద్దలు, ముస్లింలు హిందూ మహిళలను ఆకర్షించడం గురించి, వారిని మతం మార్పు చేయడం గురించి మాట్లాడతారు. మతం మార్చుకుని జిహాద్ కోసం సిరియా వెళ్ళమని ప్రోత్సహించడం గురించి వారి సంభాషణ సాగుతుంది. మరో సన్నివేశంలో ఈ చిత్రంలో ప్రధాన పాత్ర గీతాంజలి తండ్రి ఆమె హిజాబ్ ధరించడంతో గుండె పోటుకు గురైనట్టు చూపిస్తారు. ఆసిఫా బా అనే మరో పాత్ర గీతాంజలితో ఆస్పత్రిలో నీ తండ్రిని చూసి రమ్మనమని చెబుతుంది. ఆయనకు ఇలాంటి నమ్మకాలు లేవు. నమ్మకంలేని వ్యక్తి చేసిన పాపం అతడిపై ఉమ్మి వేసే దాకా నిష్కృతి కాదని చెబుతుంది. అప్పుడు గీతాంజలి.. తన తండ్రిపై ఉమ్ముతుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ బళ్ళారిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఉగ్రవాదం రూపులో వస్తున్న మార్పుగా దీనిని సూచించారు. కేరళలో ఉగ్రవాదుల కుట్రు గురించి కేరళ స్టోరీ తెలియజేస్తోందని ఆయన అన్నా రు. ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి ఏం మాట్లాడినా దానికి ప్రాధాన్యత ఉంటుంది. అందుకు రెండు విధాల కారణాలు చెప్పుకోవచ్చు. ఈ కధలో అంతర్లీనంగా ఉన్న సమాజాన్ని చీల్చే ధోరణులను ప్రోత్సహిస్తున్నట్టు, కల్పిత గాథను వాస్తవమని ప్రధాని చెబుతున్నట్టు గానూ, వేలాది మంది యువకులను వెళ్ళి ఆ చిత్రాన్ని చూడమని సందేశమి చ్చినట్టుగానూ కనిపిస్తుంది.
ఇలాంటి చిత్రాలు.. కళారూపం కాదు. పూర్తిగా ప్రచార కోసమే రూపొందించినవి. ‘మన’ అనే వర్గం ‘వారు’ అనే వర్గంపై ఉసిగొల్పే భావోద్యేగాలు రాజేసే ఎత్తుగడ. ఇది భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహం. ఇది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో, బీజేపీ వ్యూహం ఏమిటో తెలియజేస్తోంది. కేరళ స్టోరీని రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న నాయకుడు నిర్హేతుకంగా సమర్ధించడం మన సామాజిక సమానత్వాన్ని దెబ్బతీస్తుంది. దేశంలో అనేక సమస్యలున్నాయి. ముఖ్యంగా నిరుద్యో గం, దారిద్య్రం, ఆకలి, ధరల పెరుగుదల, నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గాలికి వదిలేశారు. మనకీ- వారికీ మధ్య వివాదంగానే పరిగణిస్తున్నారు.
ఈ అంశం సందర్భానుసారం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. విచారణ సందర్భంగా ఈ చిత్రంలోని సంభాషణలను కోర్టు వారి దృష్టికి తేవడం జరిగింది. ఈ పిటిషన్పై విచారణను జూలైలో జరపనున్నట్టు కోర్టు ప్రకటించింది. అదే సందర్భంలో ఈ చిత్రంలో విషయాలను కల్పితంగా చూపించడం జరిగిందనీ, వాస్తవాలేవీ లేవని ప్రకటించాలని నిర్మాతను కోర్టు ఆదేశించింది. 32,000 మంది మహిళలు సామూహికంగా మతం మార్చుకున్నట్టు ఈచిత్రంలో పేర్కొనడం జరిగింది. దానికి కూడా ఆధారాలు లేవని స్పష్టం చేయాలని ఆదేశించింది. ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నవారు ఐసిస్ మద్దతుదారులంటూ కేంద్రమంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం. ఈ ప్రకటన సమాజానికి చేటు కలిగించేదిగా ఉంది. దురదృష్టవశాత్తు అధికార వర్గం దీనిని ఆమోదిస్తోంది. నిర్మాతలు ఇది కల్పిత గాథ అని ఇప్పుడు చెబుతున్నారు. వ్యతిరేకించేవారంతా ఐఎస్ఐ మద్దతుదారులట.