సాధారణంగా ఆవు రోజుకు 10 నుంచి 20 లీటర్లు పాలు మాత్రమే ఇస్తాయి. కానీ హర్యానాలో ఓ ఆవు మాత్రం ఏకంగా 65 లీటర్లు ఇస్తోంది. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో దాదుపుర్ గ్రామానికి చెందిన కుల్దీప్ సింగ్ దగ్గర ఉన్న ఆవు.. ఎండీవర్ రకానికి చెందింది. ఈ గోవు దేశీయ రకం కాదు. దీనిని పోలాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ ఆవు రోజుకు 65 లీటర్ల పాలు ఇస్తోంది. ఈ ఆవు నుంచి ప్రతి మూడు గంటలకు ఓసారి పాలు పితుకుతారు. దీని యజమాని కేవలం ఈ ఒక్క ఆవు పాలతో నెలకు లక్ష రూపాయలకుపైగా సంపాదిస్తున్నారు. అంతేగాకుండా పాలు ఎక్కువ ఇచ్చే గోవుల పోటీల్లో పాల్గొని.. యజమానికి కాసుల వర్షం కురిపిస్తోంది.
ఈ ఆవుకు యాజమాని కుల్ దీప్ సింగ్ భారీగానే ఖర్చు చేస్తున్నారు. రోజుకు సుమారు రూ.600 నుంచి రూ.800 వరకు వెచ్చిస్తున్నారు. 35 కిలోల సైలేజ్ గడ్డి, 20 కిలోల పచ్చిమేత,12 కిలోల ధాన్యపు పొట్టును మేతగా వేస్తారు. రోజుకు కనీసం నాలుగు సార్లు స్నానం చేయిస్తారు. ఈ గోవు మరో బిడ్డకు జన్మనిస్తే ఈసారి రోజుకు 100 లీటర్ల వరకు ఇస్తుందని యజమాని కుల్దీప్ సింగ్ చెబుతున్నారు.