Wednesday, November 20, 2024

Big Story | పాత, కొత్తల కలయిక.. తెలంగాణ శాసనసభలో సరికొత్త చరిత్ర!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొత్తవాళ్లకు తెలంగాణ శాసనసభ ఎప్పుడూ స్వాగతమే పలుకుతోంది. మొదటిసారి చట్టసభల్లోకి అడుగిడుతున్న వారి సంఖ్య ప్రతీ ఐదేళ్లకోసారి భారీగా పెరుగుతూ వస్తోంది. మహామహులు ఓటమి పాలవుతున్నా… కొత్తవాళ్లకు కొదువ లేకుండా పోతోంది. పార్టీలు మారినా… ఉన్నత పదవులు కైవసం చుసుకున్నా ఇందులో కొత్తవాళ్లే సత్తా చాటుతున్నారు. మొదటిసారితోనే రాటుదేలుతున్నారు. ఇది తెలంగాణలో సరికొత్త రాజకీయ చర్చకు తావిస్తోంది. గడచిన ఎన్నికల్లో శాసనసభకు కొత్తవాళ్లు భారీ సంఖ్యలో ఎన్నికై చట్టసభలోకి అడుగు మోపారు.

119 సీట్లున్న తెలంగాణ శాసనషబకు 2018 డిసెంబర్‌ 7న జరిగిన ఎన్నికలు పాత కొత్త కలయికను చాటాయి. అయితే ఈ ఎన్నికల్లో కొత్తవారెవరో…మళ్లిd పాతవారెవరో త్వరలో తేలనున్నది. బీఆర్‌ఎస్‌ సిట్గింగ్‌లకే దాదాపు టిక్కెట్లు ఖరారు చేయగా, బీజేపీ, కాంగ్రెస్‌లు ఇంకా వడపోతలోనే ఉన్నాయి. గడచిన అసెంబ్లిd ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌) 88 స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఇక మహాకూటమి పేరుతో బరిలోకి దిగిన కాంగ్రెస్‌ 19 స్థానాలను, టీడీపీ రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

ఎంఐఎం 7 స్థానాలను, బీజేపీ ఒకచోట, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించిన పరిస్థితి ఉంది. అయితే ఆ ఎన్నికల్లో 27 మంది తొలిసారిగా చట్టసభల్లోకి ప్రవేశించి రికార్డు సృష్టించారు. అయితే ఇందులో మెజార్టీ సభ్యులు అప్పుడు గెలిచిన పార్టీలో ఉన్నారా అనే అంశంలో భిన్నమైన పరిస్థితులున్నా వారంతా శాసనసభలో ఇప్పటివరకు కొనసాగారు. ఇంవులో మెజార్టీ సభ్యులకు మళ్లి అవకాశం దక్కుతోందని అంటున్నారు.

- Advertisement -

తొలిసారి ఎమ్మెల్యేలుగా ఇల్లందునుంచి కాంగ్రెస్‌ పార్టీనుంచి హరిప్రియా నాయక్‌, అశ్వారావుపేట నుంచి టీడీపీ తరపున నాగేశ్వరరావు, ఎల్లారెడ్డినుంచి కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు సురేందర్‌, చొప్పదండి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సుంకె రవిశంకర్‌, వికారాబాద్‌నుంచి మెతుకు ఆనంద్‌, తాండూరులో కాంగ్రెస్‌ అభ్యర్‌ధిగా పైలట్‌ రోహిత్‌రెడ్డి, ఒల్లాపూర్‌నుంచి కాంగ్రెస్‌: అభ్యర్ధిగా హర్షవర్ధన్‌రెడ్డి, అంబర్‌పేట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కాలేరు వెంకటేష్‌, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉపేందర్‌రెడ్డి,. మేడ్చేల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి, ఇప్పుడు మంత్రిగా ఉన్న మల్లారెడ్డి, చెన్నూరునుంచి ఇప్పుడు విప్‌గా ఉన్న బాల్క సుమన్‌, ఇండిపెండెంట్‌ వైరానుంచి రాములు నాయక్‌, రామగుండం ఇండిపెండెంట్‌ కొరికంటి శంకర్‌, వరంగల్‌ వెస్ట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నరేందర్‌, నర్సంపేట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పెద్ది సుదర్షన్‌రెడ్డి, ఉప్పల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి భేతి సుభాష్‌రెడ్డి, ముషీరాబాద్‌నుంచి ముఠా గోపాల్‌, గద్వాల్‌నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కృష్ణమోహన్‌రెడ్డి, కొడంగల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నరేందర్‌రెడ్డి, కోదాడ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదవ్‌, నల్గొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కంచర్ల భూపాల్‌రెడ్డి, జగిత్యాల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి డాక్టర్‌ సంజయ్‌, ఆంధోల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి క్రాంతికిరణ్‌, వనపరత్తి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నిరంజన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జహీరాబాద్‌ ఎమ్మెల్యే మానిక్‌రావు, పరిగి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి మహేష్‌రెడ్డి తదితరులున్నారు.

కాగా ముందస్తు ఎన్నికలతో 2018 ఎన్నికల్లో ఆశక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టి మరింత ఉత్తేజితం చేసి రెండోసారి అధికారం కట్టబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ అనుకూల రాజకీయ పరిణామాలే చోటుచేసుకున్నాయి. కేసీఆర్‌ వ్యూహాలతో డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిల్చింది. అయితే అప్పుడు కూడా జమిలీ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను సీఎం కేసఈఆర్‌ రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, హైదరాబాద్‌లో ఉండి ఢిల్లిdలో భూకంపం సృష్టిస్తానని ఫెడరల్‌ ఫ్రంట్‌ జాతీయ నేతగా ప్రయాణం మొదలు పెట్టారు.

ఇప్పుడు ఇది బీఆర్‌ఎస్‌గా జాతీయ పార్టీ రూపాంతరం చెంది జాతీయ స్థాయికి విస్తరించింది. టీఆర్‌ఎస్‌ దెబ్బకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు చిత్తుకాగా, కాంగ్రెస్‌ ఘోర పరాభవం చవిచూసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ కనీస ప్రతిభ చూపలేకపోయింది. దీంతో 2018 ఏడాది టీఆర్‌ఎస్‌ చరిత్రలతో సుదర్ణాక్షరాలతో లిఖించే విధంగా నిల్చిపోయింది. ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 2014 ఎన్నికల్లో ప్రజల ఆశిస్సులు పొందిన పార్టీ 2018లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. 2014లో 63 స్థానాలున్న ఈ పార్టీ 2018లో 88 స్థానాలకు ఎదిగింది. బీఆర్‌ఎస్గా ఎదిగి బలీయమైన శక్తిగా ఇప్పుడు బరిలోకి దిగేందుకు సిద్దమవుతోంది. ఈ ఎన్నికల్లో నలుగురు మంత్రులు ఓటమిపాలుకాగా, కొత్తవాళ్లు మెజార్టీ సంక్యలో ఎన్నికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement