హైదరాబాద్ కాల్ హెల్త్ సీఈవో హరిపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. హరి తాళ్లపెల్లిపై కాల్ హెల్త్ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతి పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. హరితో పాటు అదే సంస్థలో పనిచేస్తున్న మరో సీనియర్ ఉద్యోగి వంశీ బత్తినిపైనా ఫిర్యాదు అందింది. గత మార్చి నెలలో వంశీ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్లో పేర్కొంది.
ఆగస్టు నెలలో మరోసారి పబ్లో టీజ్ చేస్తూ వేధించాడని తెలిపింది. అంతేకాకుండా తన కోరిక తీర్చకుంటే జాబ్లోని తీసేస్తానని బెదిరించినట్టు ఆ ఫిర్యాదులో వెల్లడించింది. కాగా, బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 354, 354 (ఎ), 354 (సీ), 354 (డీ) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.