Tuesday, November 19, 2024

Breaking: కాల్​ హెల్త్​ కంపెనీలో ఘోరం.. కోరిక తీరిస్తేనే జాబ్ ఉంటుందన్న సీఈవో, నిర్భయ కేసు నమోదు

హైదరాబాద్ కాల్​ హెల్త్​ సీఈవో హరిపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. హరి తాళ్లపెల్లిపై కాల్​ హెల్త్​ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతి పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. హరితో పాటు అదే సంస్థలో పనిచేస్తున్న మరో సీనియర్ ఉద్యోగి వంశీ బత్తినిపైనా ఫిర్యాదు అందింది. గత మార్చి నెలలో వంశీ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్​లో పేర్కొంది.

ఆగస్టు నెలలో మరోసారి పబ్లో టీజ్ చేస్తూ వేధించాడని తెలిపింది. అంతేకాకుండా తన కోరిక తీర్చకుంటే జాబ్లోని తీసేస్తానని బెదిరించినట్టు ఆ ఫిర్యాదులో వెల్లడించింది. కాగా, బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 354, 354 (ఎ), 354 (సీ), 354 (డీ) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement