Tuesday, November 19, 2024

14 ఏళ్లకే ఆరు అడుగుల పది అంగుళాలు పెరిగిన బాలుడు.. షూ సైజు 23

ఎవ‌రికైనా వారి చెప్పులు..షూస్ సైజు ఎంత ఉంటుంది..మ‌హా అయితే 10,11లేదా 12అనుకుందాం..అయితే ఇక్క‌డ ఓ బాలుడి పాదం సైజు ఏకండా 23ఉంది..ఏంటీ ఆశ్చ‌ర్య‌పోయారా..నిజ‌మండీ..14 ఏళ్లకే ఓ బాలుడు భారీగా పెరిగాడు. అందనంత ఎత్తుకు ఎదిగాడు. అతడి పాదాలకు బూట్లు కూడా తయారు చేయడం కష్టమవుతోంది. ఎందుకంటే అతడి సైజు 23. ఇప్పుడు ఇదే ఆ తల్లికి.. ఆ బాలుడికి పెద్ద టాస్క్ గా మారింది.ఓ మహిళ తన 14 ఏళ్ల కుమారుడికి బూట్లు కొనడం కోసం ప్రపంచమంతా వెతికినా ఫలితం దక్కలేదు. అతడికి కావాల్సిన బూట్ల సైజు ఏకంగా 23 ఉండడం గమనార్హం. బూట్ల తయారీ సంస్థలను సంప్రదించినా ఈ సైజులో తయారు చేయలమేని చేతులెత్తేశాయి.

అమెరికాలోని మిషిగన్ కు చెందిన ఎరిక్ జూనియర్ అనే బాలుడికి ఈ దుస్థితి వచ్చిపడింది. ఆమె తల్లి పిల్లాడి బూట్ల సైజు తో ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు. ప్రస్తుతం 14 ఏళ్లకే ఈ బాలుడు ఆరు అడుగుల పది అంగుళాలు పెరిగాడు.పుట్టినప్పటి నుంచే ఎరిక్ పాదాలు కాస్త పెద్దగా ఉండేవి. అవి అసాధారణ రీతిలో పెరిగి ఇప్పుడు ఏడో తరగతికి వచ్చేసరికి 23 సైజుకు వచ్చాయి. దీంతో అతడికి సరిపోయే బూట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.సరిపోని బూట్లతో ఎరిక్ కాళ్లకు బొబ్బలు రావడంతో అందరు పిల్లల్లా ఇతడు ఆటలు ఆడలేకపోతున్నాడు. ఇక చేసేందేం లేక తన కుటుంబ స్నేహితురాలికి చెందిన నైకీ సంస్థ తో కలిసి 22 సైజ్ ఉన్న ఓ బూట్ల జతను ప్రత్యేకంగా ఆమె తయారు చేసి బాలుడికి ఇచ్చింది.ఇతడికి బూట్ల సమస్యపై మీడియాలో కథనం రావడంతో వైరల్ అయ్యింది. దీంతో స్పందించిన ప్యూమా అండర్ ఆర్మర్ సంస్థలు ఎరిక్ కోసం 23 సైజు బూట్లను తయారు చేయడానికి ముందుకు వచ్చాయి.మొత్తానికి ఈ బాలుడికి సంబంధించిన వార్త వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement