ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ఇప్పుడు పిల్లలపై ప్రతాపం చూపిస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ సోకింది. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే, ఆ బాలుడు హైదరాబాద్ మీదుగా బెంగాల్‌కు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాలుడిని బెంగాల్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో ఇప్పటికే రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ సర్కారు ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. బాధితులను ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రజలు కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.