Tuesday, November 19, 2024

బ్రిటీష్ మత్స్యకారుడి వలకు చిక్కిన.. 31 కేజీల గోల్డ్‌ఫిష్‌..

బ్రిటీష్ మ‌త్స్య‌కారుడు ఆండీ హాకెట్ వలకు అరుదైన గోల్డ్‌ఫిష్ దొరికింది. ప్ర‌పంచంలోనే అత్యంత బ‌రువైన గోల్డ్‌ఫిష్ చేప‌గా రికార్డయ్యింది. గతంలో అమెరికాలోని మిన్న‌సొట్టాలో దొరికిన గోల్డ్‌ఫిష్ క‌న్నా ఇది సుమారు 14 కేజీల ఎక్కువ బ‌రువు ఉంది. ఫ్రాన్స్‌లోని చాంపేన్‌లో ఉన్న బ్లూవాట‌ర్ స‌ర‌స్సులో ఆండీ వ‌ల‌కు ఈ చేప చిక్కింది. లెద‌ర్ కార్ప్‌, కోయి కార్ప్ కు చెందిన హైబ్రిడ్ ర‌క‌మే ఈ భారీ చేప. దాదాపు 25 నిమిషాల వేట త‌ర్వాత ఆండీకి గోల్డ్‌ఫిష్ దొరికింది. ఆ చేప‌కు ద క్యారెట్ అన్న నిక్ నేమ్ ఉంది. బంగారు రంగులో మెరిసిపోయే ఈ గోల్డ్ ఫిష్ లు చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా ఉంటాయి. కానీ బ్రిటీష్ కు చెందిన ఓ వ్యక్తి పట్టుకున్న గోల్డ్ ఫిష్ మాత్రం అత్యంత భారీగా ఉంది. సుమారు 31కిలోల బరువైన గోల్డ్ ఫిష్ ఇది.

Advertisement

తాజా వార్తలు

Advertisement