Monday, November 18, 2024

90మంది పైల‌ట్ల‌పై నిషేధం – మ‌రోసారి శిక్ష‌ణ

90మంది పైల‌ట్ల‌పై నిషేధం విధించారు పౌర విమాన‌యాన‌శాఖ డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్. విమానంని న‌డిపే సామ‌ర్థ్యం వారిలో లేద‌ని గుర్తించి వారిని తొల‌గించారు. కాగా మరోసారి శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకునే వరకు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడపకుండా నిషేధం విధించింది. దేశ పౌరవిమానయాన రంగంలో ఈ తరహా సంఘటన ఎన్న‌డూ జ‌ర‌గ‌లేద‌నే చెప్పాలి. డీజీసీ అరుణ్ కుమార్ దీనిపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి అయితే బోయింగ్ మ్యాక్స్ విమానాలను నడపకుండా సదరు పైలట్లపై నిషేధం విధించాం. ఈ విమానాలను నడపడంలో వారు తిరిగి విజయవంతంగా శిక్షణ ముగించాల్సి ఉంటుంది. మళ్లీ లోపాలను గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఈ నిషేధం తమ కార్యకలాపాలపై ప్రభావం చూపించదని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం 11 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నిర్వహిస్తున్నాం. వీటి కోసం 144 పైలట్లు అవసరం. మా వద్దనున్న 650 మంది పైలట్లలో నిషేధం తర్వాత కూడా 560 మంది పైలట్లు అందుబాటులో ఉంటార‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement