ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలో బస్సు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలైయ్యారు. మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌కు వెళుతుండగా ఇసుక బస్తాలను తీసుకెళుతున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఇది కూడా చదవండి: అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్..