Friday, November 22, 2024

Breaking: గుజరాత్​ కేబుల్​ బ్రిడ్జి ఘటన.. 141 మంది చావుకు కారణమైన కంపెనీపై కేసు, 9 మంది అరెస్టు

గుజరాత్‌లోని మోర్బీలో వంతెన కూలి 141 మంది చనిపోయారు. ఈ నదిలో ఇంకా గల్లంతైన వారి కోసం సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతోంది. అయితే.. ఇవ్వాల (సోమవారం) ఘటనకు బాధ్యులను చేస్తూ బ్రిడ్జి రిపేరు చేసిన ఓరేవా కంపెనీకి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారిలో బ్రిడ్జిని పునరుద్ధరించిన ఒరేవా సంస్థ అధికారులు, టిక్కెట్లు అమ్మేవారు, భద్రతా సిబ్బంది ఉన్నారు.

మోర్బి జిల్లాలోని ఈ వంతెన నిర్వహణకు 15 సంవత్సరాల ఒప్పందం ఉన్న ఒరెవా కంపెనీ.. దేవ్‌ప్రకాష్ సొల్యూషన్స్ అనే రికార్డులోలేని ఓ చిన్న కంపెనీకి  వంతెన రిపేర్లు, సాంకేతిక అంశాలను సెట్​ విషయంలో అవుట్‌సోర్స్ కోసం సబ్​ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు​ ఆరోపణలు వస్తున్నాయి. కాగా, మార్చి నెలలో చారిత్రాత్మకమైన, బ్రిటీష్​ కాలం నాటి ఈ వంతెన మరమ్మతు పనుల కోసం ఒరేవాను నియమించారు. గుజరాతీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న అక్టోబరు 26వ తేదీన అంటే.. ఏడు నెలల తర్వాత ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

నిర్వహణ, మరమ్మతుల కోసం వంతెనను కనీసం 8 నుండి 12 నెలల వరకు మూసి ఉంచాలని కంపెనీ తన ఒప్పందానికి కట్టుబడి ఉండకుండా గత వారం వంతెనను తెరవడాన్ని పోలీసులు తీవ్రమైన బాధ్యతారాహిత్యం.. అజాగ్రత్తగా పేర్కొన్నారు. కానీ ఎఫ్‌ఐఆర్‌లో ఎవరి పేరును పేర్కొనలేదు. వంతెన యొక్క మరమ్మత్తు, నిర్వహణతో పాటు.. నిర్వహణకు ఒప్పందం చేసుకున్న వారు సరైన రీతిలో మరమ్మత్తు పని చేయలేదు అని FIRలో పేర్కొన్నారు.  

దాదాపు 500 మంది వ్యక్తులకు నిన్న (ఆదివారం) 12రూపాయల నుంచి 17రూపాయల టిక్కెట్లను విక్రయించారు. దీని ఫలితంగా వేలాడే ఈ తీగల వంతెనపై అధిక భారం ఏర్పడిందని, దీనివల్ల పాత మెటల్ కేబుల్స్ దెబ్బతిని ప్రమాదానికి దారితీసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వంతెనపై ఉన్న కొందరు (125 మంది) బ్రిడ్జిని అటూ ఇటూ.. ఊపడం CCTV ఫుటేజీలో కనిపించింది.

- Advertisement -

2037 వరకు ప్రతి సంవత్సరం టికెట్ ధరలను పెంచడానికి కాంట్రాక్ట్ కంపెనీని అనుమతించింది. గత వారం వంతెనను పునఃప్రారంభిస్తున్నప్పుడు.. ఓరెవా మేనేజింగ్ డైరెక్టర్ జయసుఖ్‌భాయ్ పటేల్ విలేకరులతో మాట్లాడుతూ.. కంపెనీ రెండు కోట్లతో 100 శాతం పునరుద్ధరణ పనులు  పూర్తి చేసిందని చెప్పారు. పునరుద్ధరించబడిన వంతెన  8 నుండి 10 సంవత్సరాల వరకు కొనసాగుతుందని కూడా అతను పేర్కొన్నాడు.  కానీ, ఇంతలోనే ఇంత పెద్ద ఘోరం జరగడంపై యావత్​ దేశం నిర్ఘాంతపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement