Monday, November 18, 2024

24గంట‌ల్లో 8,008ఫుల్ అప్స్.. గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డ్

24గంట‌ల్లో ఏకంగా 8,008ఫుల్ అప్స్ చేసి న్యూ గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డుని క్రియేట్ చేశాడు. ఛారిటీ గ్రూపు డిమెన్షియా ఆస్ర్టేలియా కోసం రూ. 5 ల‌క్ష‌ల నిధుల కోసం జాక్స‌న్ ఇటాలియానో సిడ్నీలో ఈ అరుదైన ఫీట్‌తో న్యూ గిన్నీస్ వ‌రల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు. 24 గంట‌ల్లో 8008 పుల్అప్స్‌తో జాక్స‌న్ గ‌త రికార్డు 7715 పుల్అప్స్‌ను అధిగ‌మించాడు. వ‌ర‌ల్డ్ రికార్డ్ బ్రేకింగ్ ఫీట్‌కు సంబంధించిన ఫొటోల‌ను అత‌డు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. త‌న శ‌రీరాన్ని పరీక్షించేందుకు 8 నెల‌ల పాటు పుల్అప్స్ ప్రాక్టీస్ చేశాన‌ని జాక్స‌న్ చెప్పుకొచ్చారు. ఈ ఫీట్ అనంత‌రం జాక్స్ ఛారిటీ కింద 6000 డాల‌ర్లు సేక‌రించారు.ఆరోగ్యంగా ఉండేందుకు, తీరైన ఆకృతి కోసం పుల్అప్స్ మెరుగైన వ‌ర్క‌వుట్‌గా పేరొందింది. పుల్అప్స్‌ ఫిట్‌నెస్‌ను పెంచ‌డంతో పాటు వెన్ను, భుజాలు, ఛాతీ, చేయి కండ‌రాల‌ను యాక్టివేట్ చేస్తుంది. అయితే రోజులో ఎన్ని పుల్అప్స్ చేయ‌వ‌చ్చ‌నేది ఆయా వ్య‌క్తుల సామ‌ర్ధ్యంపై ఆధార‌ప‌డిఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement