పెరూ సెంట్రల్ తీరంలో కనీసం 800 సంవత్సరాల వయస్సు గల మమ్మీని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ గుర్తించింది. తవ్వకాల్లో భాగంగా ఈ మమ్మీని లిమా ప్రాంతంలో కనుగొన్నట్లు పురావస్తు శాస్త్రవేత్త పీటర్ వాన్ డాలెన్ లూనా తెలిపారు. మమ్మీ అవశేషాలు దక్షిణ అమెరికా దేశంలోని తీరం, పర్వతాల మధ్య అభివృద్ధి చెందిన సంస్కృతికి చెందినవి అయి ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. అయితే ఆ మమ్మీ ఆడా, మగా అనేది మాత్రం తాము గుర్తించలేదన్నారు.
“మమ్మీ యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే, శరీరమంతా తాళ్లతో కట్టివేయబడి, చేతులతో ముఖాన్ని కప్పి ఉంచారు, ఇది స్థానిక అంత్యక్రియల నమూనాలో భాగంగా ఉంటుంది” అని శాన్ మార్కోస్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన వాన్ డాలెన్ లూనా చెప్పారు. దేశంలోని ఎత్తైన ఆండియన్ ప్రాంతంలో నివసించిన వ్యక్తి అవశేషాలుగా ఉన్నాయని ఆయన చెప్పారు. లిమా నగర శివార్లలో కనుగొనబడిన భూగర్భ నిర్మాణంలో ఈ మమ్మీని కనుగొన్నారు. సమాధిలో సిరామిక్స్, కూరగాయల అవశేషాలు, రాతి పనిముట్లు కూడా ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital