రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నెలకొన్న సమయంలో ఉక్రెయిన్ ఎవరైనా యుద్ధంలో పాల్గొనవచ్చని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓ 80యేళ్ల వ్యక్తి బ్యాగ్ ని సర్దుకుని వచ్చేశాడు. అతన్ని సైనికులు తనిఖీ చేస్తన్నారు. ఇప్పుడీ ఫొటో నెటిజన్లను కదిలించివేస్తోంది. మాతృభూమి రక్షణ కోసం ఆ వయసులో కదిలిన అతని సంకల్పానికి హ్యాట్సాప్ చెబుతున్నారు. ట్విటర్ లో వైరల్ గా మారిన ఉక్రెయిన్ ఆర్మీలో చేరేందుకు క్యూలో నిలబడిన ఓ వ్యక్తి ఫోటోను Kateryna Yushchenko షేర్ చేశారు. సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి చేతిలో ఓ బ్యాగ్ ఉంది. అతని బ్యాగ్‌లో ఉన్న వస్తువులు ఖచ్చితంగా మిమ్మల్ని కన్నీళ్లు పెట్టిస్తాయి. ఆ ఫొటోకు క్యాప్షన్ రాస్తూ… “ఎవరో ఈ 80 ఏళ్ల వృద్ధుడి ఫోటోను పోస్ట్ చేసారు, అతను సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికోసం తన బ్యాగ్ లో 2 టీ-షర్టులు, ఒక జత ఎక్స్ ట్రా ప్యాంటు, టూత్ బ్రష్, కొన్ని శాండ్‌విచ్‌లు ఉన్న చిన్న లంచ్ బాక్స్ ఉన్నాయి. తన మనవళ్ల కోసం యుద్ధంలో చేరాలనుకుంటున్నట్లు చెప్పాడని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు 133 వేల లైక్‌లు, టన్నుల కొద్దీ రియాక్షన్స్ వచ్చాయి. మాతృభూమి మీద ఆ వృద్ధుడికి ఉన్న ప్రేమను ప్రజలు మెచ్చుకుంటున్నారు. కామెంట్స్ లో ఇదే రాస్తూ.. శాంతి సందేశాలు చెబుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement