కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కేవలం వెండితెరపైనే హీరో కాదు.. నిజ జీవితంలోనూ సూపర్ హీరో అనిపిస్తోంది ఆయన చేసిన పని చూస్తుంటే. తాజా సమాచారం ప్రకారం పునీత్ తన దాతృత్వ ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకెళ్లడానికి గతంలో 8 కోట్ల రూపాయల మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూపంలో డిపాజిట్ చేశాడు. ఇప్పుడు పునీత్ మరణించడంతో ఆ మొత్తాన్ని ఆయన ఆధ్వర్యంలో నడిచిన 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు, గతంలో ఆయన నిర్వహించిన 45 పాఠశాలలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబోతున్నారట. అయితే రూ. 8 కోట్ల డిపాజిట్ గురించి పునీత్ కుటుంబం ఇంకా స్పందించలేదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement