Friday, November 22, 2024

న‌దిలో స్విమ్మింగ్ చేసిన – 70ఏళ్ల బామ్మ -అవాక్క‌యిన జ‌నం

నేటి ఆధునిక ప్ర‌పంచంలో 30నుండి 40ఏళ్ల‌కే ఎన్నో హెల్త్ ఇష్యూస్ వ‌స్తున్నాయి. షూగ‌ర్..బిపిలు చుట్టుముడుతున్నాయి. అయితే ఇలాంటి కండిష‌న్ల మ‌ధ్య 70ఏళ్లు బ‌త‌క‌డ‌మా అనే మాటే వింత‌గా తోస్తోంది. 70ఏళ్ల వ‌య‌సులో మంచమెక్కేస్తుంటారు చాలామంది. అయితే ఓ 70ఏళ్ల వృద్ధురాలు ఏకంగా బ్రిడ్జ్ మీద నుంచి న‌దిలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకి రావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. వివ‌రాల్లోకి వెళ్తే..హ‌రిద్వార్‌లోని హ‌ర్ కీ పురిలో ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి ఓ బామ్మ.. కింద ప్ర‌వ‌హిస్తున్న గంగాన‌దిలోకి జంప్ చేసింది. ఆ త‌ర్వాత ఈజీగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. బ్రిడ్జ్ మీద నుంచి దూకడ‌మే కాకుండా త‌న‌దైన స్ట‌యిల్లో ప‌విత్ర స్నానం చేసి యువ‌త‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ బామ్మ గంగ‌లోకి దూకుతున్న స‌మ‌యంలో అక్క‌డున్న‌వాళ్ల ఆమెకు చీర్స్ చెప్పారు. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement