భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా దేశంలో కొత్తగా 72,330 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,22,21,665 కి చేరింది. ఇందులో 1,14,74,683 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 5,84,055 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనాతో 459 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,62,927 కి చేరింది. బుధవారం నాటికి 6,51,896 మందికి కరోనా టీకాలను ఇచ్చామని కేంద్రం పేర్కొంది.
ఇక తెలంగాణలోనూ కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ 887 కొత్త కేసులు నమోదు కాగా… నలుగురు మృతి చెందారు. మొత్తం మరణాలు 1671కు పెరిగాయి. తాజా కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 308,776కి చేరింది. తాజాగా 337 మంది కోలుకోగా… ఇప్పటి వరకు 301,564మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,511యాక్టివ్ కేసులు ఉండగా అందులో 2,166 మంది ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 201 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 59,297 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.