ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అయితే, ఈ యుద్ధంలో ఏడుగురు రష్యన్ జనరల్స్ హతమైనట్లు పశ్చిమ దేశాల అధికారులు వెల్లడించారు. తాజాగా లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రేజన్‌స్టీవ్ మృతి చెందినట్లు తెలిపారు. యాకోవ్ రష్య 49వ కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్, రష్యన్ ఆర్మీ కమాండర్ జనరల్ వ్లాయిస్లావ్ యేర్సోహ్ కూడా ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. ఈయన ఆరో కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి చెందిన జనరల్. అయితే యేర్సోహ్‌ను వారం రోజుల క్రితమే బాధ్యతల నుంచి తొలగించారు. ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ జరిపిన దాడిలోవ్యూహాత్మక వైఫల్యాల కారణంగా యేర్సోహ్‌ను బాధ్యతల నుంచి ఆకస్మికంగా తొలగించారు. ఈ ఏడుగురిలో చెచెన్ స్పెషల్ ఫోర్సెస్ జనరల్ మగోమద్ తుషేవ్ కూడా ఉన్నారు. యుద్ధంలో కేవలం 1,300 మంది సైనిక సిబ్బంది మరణించినట్లు క్రెమ్లిన్ శుక్రవారం పేర్కొంది. కానీ ఈ సంఖ్య నాలుగు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉండొచ్చని పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement