Friday, November 22, 2024

స్ట్రెయిన్ వైరస్.. కొత్త లక్షణాలు తెలుసా?!

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోన్న కరోనా వైరస్ రోజుకో కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాల్లో కరోనా కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. చైనాలో పుట్టిన ఈ మహ్మమారితో ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇక, బ్రిటన్‌ను కలవరపెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్ లోనూ ప్రవేశించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, పూణె, తదితర ప్రాంతాల్లో కేసులు గతంలో నమోదు అయ్యాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ ద్వారా కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్‌లో ప్రవేశించినట్టు నిర్ధారించారు.

ఇక కొత్త కరోనా వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్‌కు గురైన చాలామందిలో దగ్గు, జ్వరం, రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపించేవి. కానీ, వైరస్ వచ్చినా, అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించని వారు కూడా చాలామంది ఉన్నారు. దాంతో, తాము కోవిడ్-19 వ్యాధితో అంతా తిరిగేస్తున్నామనే విషయం వారికి ఎప్పటికీ తెలీకుండానే ఉండిపోయింది. అయితే కరోనా వైరస్ లక్షణాల జాబితా కూడా పెరుగుతూనే ఉంది.. ఇప్పటివరకూ సామాన్యానికి బాగా తెలిసిన లక్షణాలకు మరికొన్ని జత చేరాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

జ్వరం, దగ్గు, వాసన, రుచి కోల్పోవడం పాత స్ట్రెయిన్ లక్షణాలుగా ఉండేవి ఇప్పటివరకూ అయితే వీటితోపాటు.. ఒళ్ళు నొప్పులు, కండ్ల కలక, కళ్ళు ఎర్రగా మారడం, గొంతు మంట, శరీరంపై దద్దుర్లు, అతిసారం. తలనొప్పి, కాళ్ళు చేతులు పాలిపోయినట్లు కనిపించడం స్ట్రెయిట్ కొత్త లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఏ రెండు లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement