జార్ఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పాకుర్ జిల్లాలో బస్సు- గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అమ్రపర పోలీస్ స్టేషన్ పరిధిలోని పదేర్‌కోలా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
గ్యాస్ సిలిండర్లను రవాణా చేస్తున్న ట్రక్కు.. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో 24 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు చెప్పారు. పొగమంచు కారణంగా రోడ్డు కనపించకపోవడంతోనే బస్సు – ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నట్లుగా తెలుస్తోంది.ఈ ఘటనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital