హర్యానా ఫరీదాబాద్‌లోని ఓ నివాస గృహంలో 7 అడుగుల పొడవైన కొండచిలువ హల్ చల్ చేసింది. దీంతో వెంటనే ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అదే సమయంలో పోలీసులు, వన్యప్రాణి విభాగం సిబ్బంది ఎంతో శ్రమించి ఆ కొండచిలువని రక్షించారు. ఈ కేసులో అందిన సమాచారం ప్రకారం.. కొండచిలువ బాత్రూమ్ కుళాయిలో చుట్టుకొని ఉంది. ఇక్కడ కొండచిలువలు సాధారణంగా జనం కంట పడుతుంటాయి. అయితే ఇంటిలో కొండచిలువ కనిపించడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఇక్కడ కొండచిలువ కనిపించడంతో ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. నివాస ప్రాంతంలో ఈ విధంగా బయటకు వచ్చిన కొండచిలువ ఎక్కడో చిన్న పిల్లలకు, పెంపుడు జంతువులకు ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..