మధ్యప్రదేశ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. ఇండోర్‌లోని ఓ రెండంతస్తుల భవనంలో శనివారం తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు రక్షించినట్టు ఇండోర్ కమిషనర్ హరినారాయణ చారీ మిశ్రా తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి మూడు గంటలకు శ్రమించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement