Tuesday, November 19, 2024

వానాకాలంలో 695.67 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరణ.. 3వ స్థానంలో తెలంగాణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : 2021-22 వానాకాలం సీజన్ దిగుబడి నుంచి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వడ్ల కొనుగోలుకు సంబంధించి ఫిభ్రవరి 20 నాటికి 695.67 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఇందులో అత్యధికంగా 186 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించగా, 92 లక్షల మెట్రిక్ టన్నులతో ఛత్తీస్‌గఢ్ రెండో స్థానంలో, 70.22 లక్షల మెట్రిక్ టన్నులతో తెలంగాణ 3వ స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 34.49 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం సేకరించింది. దేశవ్యాప్తంగా మొత్తం 94.15 లక్షల మంది రైతులకు కనీస మద్ధతు ధర కింద రూ. 1,36,350.74 కోట్లు చెల్లించినట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement