ఎయిర్ పోర్టులలో అక్రమంగా తరలిస్తున్న బంగారంను డీఆర్ఐ అధికారులు పట్టుకుంటున్న విషయం విధితమే. బంగారం స్మగ్లింగ్‌పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు డీఆర్ఐ పేర్కొన్నది. తాజాగా 65.46 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ వెల్లడించింది. ముంబై, పాట్నా, ఢిల్లీలో సాగుతున్న స్మగ్లింగ్ దందా ఆటకట్టించింది. విదేశాలకు చెందిన 394 గోల్డ్ బార్లను డీఆర్ఐ అధికారులు ఇటీవల పట్టుకున్నారు. వాటి విలువ సుమారు 33.40 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement