దేశంలో ఓవైపు ఒమిక్రాన్ కేసులు దడ పుట్టిస్తుంటే.. మరోవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఓరోజు తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటితో పొల్చితే ఇవాళ కేసులు సంఖ్య స్వల్పంగా పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 6,317 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,58,481 కు చేరింది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,906 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,42,01,966 కు చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనాతో 318 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతు చెందిన వారి సంఖ్య 4,78,325 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 78,190 యా క్టివ్ కరోనా కేసుల ఉన్నాయి. కరోనా పాజిటివిటి రేటు 98.34 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,38,95,90,670 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital