Monday, November 25, 2024

ఓరి ముసలోడా, ఇదేం పని.. 15ఏళ్ల బాలికపై అఘాయిత్యం, ప్రెగ్నెన్సీ రావడంతో వెలుగులోకి!

63 ఏళ్ల ఓల్డ్​ మ్యాన్​ ఓ 15ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు. బాలిక ఇంట్లోనే రెంట్​కు ఉంటున్న ఈ పెద్దమనిషి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే.. 10వ తరగతి చదివే ఆబాలికకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్​కు తీసుకెళ్లారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది.

మెడికల్​ టెస్ట్​ల తర్వాత ఆ బాలిక ప్రెగ్నెన్సీ అన్న విషయం బయటపడింది. దీంతో డాక్టర్​, ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు కంప్లెయింట్​ చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులకు వారి ఇంట్లో ఉండే వృద్ధుడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిసింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. లైంగిక నేరాల నుంచి బాలల నిరోధక చట్టం (పోక్సో) కింద అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని శుక్రవారం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

కాగా, మరో ప్రత్యేక ఘటనలో తనపై అత్యాచారం చేశారని ఓ బాలిక ఇద్దరు క్లాస్​మేట్స్​పై కంప్లెయింట్​ చేసింది. ఆ ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఈ ఘటనలోనూ బాలిక మూడు నెలల గర్భిణి. చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు అబ్బాయిలను అరెస్ట్ చేసి అబ్జర్వేటరీ హోమ్‌కు తరలించారు. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో బాలికను తమ నివాసానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement