చిన్నపిల్లలు మట్టి తినేందుకు, ఇసుకలో ఆడేందుకు ఇష్టపడతారు. మరి పెద్దవారు ఈ పని చేస్తారా అంటే చేయరనే సమాధానం వస్తుంది. ఇసుకలో ఆడే పిల్లలనే తిట్టే పెద్దలు ఆ ఇసుకని తింటారా అంటే ఇదిగో ఇక్కడ చూస్తోన్న బామ్మ ఇసుకనే తింటోందట. అది కూడా కాస్తో కూస్తో కాదండోయ్..కేజీల కేజీలు ఇసుకని తినేస్తోంది. మరి ఆమెకి హెల్త్ సమస్యలు రావట్లేదా అంటే..ఆ వివరాలు చూద్దాం. కుష్మావతి దేవి అనే 75ఏళ్ళ బామ్మ ఇసుకని అన్నంలా తింటోంది. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఈమె నిత్యం ఇసుకనే ఆహారంగా తింటోంది. వారణానికి చెందిన ఈమె ఇసుకని తింటోన్నా ఆరోగ్యంగా ఉండటం విశేషం. గత 60ఏళ్ళుగా ఈవిడగారికి ఇదేపని. అసలు నా ఆరోగ్యానికి కారణం ఇసుకతినడమేనని చిరునవ్వులు చిందిస్తోంది.
అయితే ఈ బామ్మ ఇసుక అలవాటుని మాన్పించడానికి కుటుంబసభ్యులు ఎంతో ప్రయత్నించారు. ఆమె ఇద్దరు కుమారులు.. వారి పిల్లలు కలిసి ఎంత చెప్పినా వినలేదట. చివరికి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళదామని అన్నా కుష్మావతి తన ఇసుకని తినే అలవాటుని మాత్రం వీడలేకపోతుంది. ఇసుక తినడం మానమంటున్నారని . ఏకంగా కొడుకులను, మనవళ్లను వదిలి వేరే ఇంటికి వెళ్ళిపోయింది ఈ బామ్మ. కుటుంబానికి దూరంగా ఒకటిగా నివసిస్తుంది, 75 ఏళ్ళు దాటిన ఈ బామ్మ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా తనపనులు తాను చేసుకోవడమే కాదు.. పొలం పనులు కూడా చేస్తుంది. అయితే బామ్మ ఇలా ఇసుక తినడానికి కారణం ఐరెన్ లోపం అయి ఉండవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.
అసలు ఇసుకని ఆహారంగా తీసుకునే అలవాటు డాక్టర్లు చెప్పిన సలహానే అంటోంది. ఎందుకిలా అంటే ఈ బామ్మగారు టీనేజ్ లో ఉన్నప్పుడు విపరీతమైన కడుపునొప్పి వచ్చిందట. దాంతో ఆసుపత్రికి వెళ్లితే డాక్టర్స్ కొంచెం బూడిద తినమన్నారట..అలా.. బూడిద తినడం మొదలు పెట్టి.. తర్వాత ఇసుకని తినడం మొదలు పెట్టిందట.. అప్పుడు మొదలైన ఈ ఇసుకని తినే అలవాటు ఇప్పటికీ మానలేదు. కుష్మావతి టిఫిన్ తినడం లెట్ అయినా ఫీల్ అవదు కానీ.. ఇసుకని మాత్రం రోజుకి మూడుపూటలా సంతృప్తిగా తింటుంది. అయితే ఇసుకని తినే ముందు.. దానిని శుభ్రం చేసుకుని.. నీటిలో కడిగి అప్పుడు తింటుందట. ఇప్పుడు ఈ బామ్మ పేరే అందరినోట వినిపిస్తోంది. ఇసుక తినడం ఏంటో విడ్డూరం అంటున్నారు అందరూ.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..