ఇప్పటికే పలు రకాల ఛాలెంజ్ లు నడుస్తున్నాయి. బకెట్ ఛాలెంజ్, ఐస్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్. ఇప్పుడు వీటి జాబితాలోకి ఫుడ్ ఛాలెంజ్ కూడా వచ్చి చేరింది. ఈ ఛాలెంజ్ లో ఎవరు ఎంత ఎక్కువ తింటే వారే విన్నర్. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ లోని గొండా రిజర్వ్ పోలీస్ లైన్ లో భారీ ఫుడ్ కాంపిటేషన్ ని నిర్వహించారు. దాంతో ఈ పోటీలో హెడ్ కానిస్టేబుల్ హృషీకేష్ గెలిచాడు. ఈయన ఏకంగా 60పూరీలు తిని రికార్డును సృష్టించాడు. రిక్రూట్స్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముందు బడా ఖానా పోటీని చేపట్టారు యూపీ పోలీసు ఉన్నతాధికారులు. నూతన రిక్రూటర్లు, ఉద్యోగులు కలిసి భోజనం చేసే ఉద్దేశంతో ఈ ఫన్నీ టాస్క్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే, గతంలో 51పూరీలు తిని రికార్డు నెలకొల్పిన హృషీకేష్ రాయ్ ఈసారి పోటీలో 60పూరీలను లాగించి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. ఈ పోటీలో గెలుపొందిన కానిస్టేబుల్ రాయ్‌ని పోలీస్ ఉన్నతాధికారులు సన్మానించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..