దేశంలో అనుమతిలేకండానే ఆరు వందలకు పైగా రుణ యాప్‌లు పని చేస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించి రుణాలు ఇస్తున్నాయి. సకాలంలో చెల్లించలేదన్న కారణంతో వేధింపలకు పాల్పడుతున్నాయి. రుణ యాప్‌ల ఆగడాల భారీనపడిన చాలా మంది అమాయకులు ప్రాణాలు తీసుకున్నారు. వీటిపై దేశ వ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. అన్ని రాష్ట్రాల్లోనూ రుణ యాప్‌ల ఆగడాలపై ఫిర్యాదులు వస్తున్నాయి.
ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఇండియా రుణ యాప్‌లపై హెచ్చరించారు. రుణ యాప్‌ల నిర్వహకులు వేధిస్తే పోలీసు కేసులు నమోదు చేయాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇప్పటి వరకు ఆరు వందల అనుమతిలేని రుణ యాప్‌లను గుర్తించినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
అనుమతి పొందిన రుణ యాప్‌ల వల్ల సమస్య వస్తే ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా శక్తికాంత దాస్ తెలిపారు. యాప్‌ల నుంచి రుణాలు తీసుకునే ముందు , అది ఆర్బీఐ వద్ద రిజిస్ట్రర్ అయ్యింది లేనిది పరిశీలించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. అనుమతి లేని వాటి నుంచి రుణాలు తీసుకోవద్దని కోరారు.
రిజిస్టర్ కాని యాప్‌లపై 2020 జనవరి 1 నుంచి 2021 మార్చి 31 వరకు వచ్చిన 2,562 ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. వీటిలో మహారాష్ట్ర నుంచి 572, కర్నాటక నుంచి 394, ఢిల్లిd నుంచి 352, హర్యానా నుంచి 314 ఫిర్యాదులు వచ్చాయి. అనుమతిలేని , రిజిస్టర్ కాని రుణ సంస్థలు, యాప్‌లు నియంత్రించేందుకు ఆర్బీఐ ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కొత్త ఐటీ చట్టం ప్రకారం ఇప్పటి వరకు 27 రుణ యాప్‌లను బ్లాక్ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.