67ఏళ్ల బిల్ గేట్స్ 60ఏళ్ల పౌలా హర్డ్ తో గత ఏడాది నుండి రిలేషన్ లో ఉన్నారని ఈ మేరకు అమెరికా తమ పత్రికల్లో కథనాన్ని కూడా ప్రచురించింది. గత నెలలో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సందర్భంగా మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, పౌలా హర్డ్ తో కలిసి కనిపించారు. పౌలా హర్డ్ ఎవరంటే టెక్ దిగ్గజం ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్ హర్డ్ భార్య . ఇక బిల్ గేట్స్.. పౌలా రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ఉన్నారని… వారు విడదీయలేని జంట అని వారికి అత్యంత సన్నిహితుడైన ఒక స్నేహితుడు తెలిపారు. కాగా 2019లో పౌలా హర్డ్ భర్త మార్క్ హర్డ్ మరణించారు. క్యాన్సర్ తో చాలా కాలం పోరాడిన తర్వాత ఆయన మృతి చెందారు. పౌలా హర్డ్ టెక్ ఎగ్జిక్యూటివ్ గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆమె ఈవెంట్ ప్లానర్ గా పని చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చాలా చురుకుగా వ్యవహరిస్తుంటారు. మరోవైపు బిల్ గేట్స్, మిలిందా గేట్స్ 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 30 ఏళ్ల వైవాహిక జీవితానికి వారు ముగింపు పలికారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement