Tuesday, November 26, 2024

60మంది చిన్నారుల‌కి తండ్రి ఒక్క‌డే..

60మంది చిన్నారుల‌కు తండ్రి ఒక్క‌డే. ఎక్క‌డో తెలుసా ఆస్ట్రేలియాలో. వీర్య‌క‌ణాలు దానం చేసిన ఆ వ్య‌క్తి పేరుని మాత్రం అధికారులు వెల్ల‌డించ‌లేదు. నిజానికి ఆస్ట్రేలియా చ‌ట్టాల ప్ర‌కారం స్పెర్మ్ డోనేష‌న్ నేరం. గిఫ్ట్‌లు తీసుకుని వీర్య క‌ణాల ఇవ్వ‌డం కూడా నిషేధం. అక్ర‌మ ప‌ద్ధ‌తిలో వీర్య క‌ణాల‌ను డోనేట్ చేయ‌డం వ‌ల్ల అత‌నికి 15 ఏళ్ల జైలుశిక్ష ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. పిల్ల‌లు లేని వారు నేరుగా డోనార్‌ను క‌ల‌వ‌డం వ‌ల్ల అక్ర‌మాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌భుత్వ అధికారులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇండిపెండెంట్ మీడియా ఓ క‌థ‌నాన్ని రాసింది. ఇంత‌కీ ఈ గ‌మ్మ‌త్తు ఎలా బ‌య‌ట‌ప‌డిందో తెలుసుకుందాం. ఎల్జీబీటీ వ‌ర్గానికి చెందిన పేరెంట్స్ అంద‌రూ ఓ గెట్ టుగెద‌ర్ మీటింగ్ పెట్టుకున్నారు.

అయితే అక్క‌డ‌కు పిల్ల‌లతో పేరెంట్స్ వ‌చ్చారు. అక్క‌డకు వ‌చ్చిన పిల్ల‌ల్లో అంద‌రూ దాదాపు సేమ్‌గా క‌నిపించారు. పిల్ల‌లు ఒకేలాగ ఉండ‌డం గ‌మనించి పేరెంట్స్ షాక‌య్యారు. దీంట్లో ఏదో తేడా ఉంద‌ని గ‌మనించి ఆ కోణంలో ఆరా తీశారు. ఆస్ట్రేలియాలో ఉన్న అన్ని ఐవీఎఫ్ క్లినిక్‌ల‌ను సంప్ర‌దించారు. ఆ ద‌ర్యాప్తులో విస్తుపోయే నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అన్ని సెంట‌ర్ల‌లో వీర్య క‌ణాలు డోనేట్ చేసిన వ్య‌క్తి ఒక్క‌డే అని తెలిసింది. నాలుగు పేర్ల‌తో అత‌ను త‌న వీర్య క‌ణాల‌ను దానం చేసిన‌ట్లు గుర్తించారు. స్పెర్మ్ డోనార్ సెంట‌ర్లు అన్నీ అత‌ని వ‌ద్ద నుంచి వీర్య క‌ణాల్ని సేక‌రించిన‌ట్లు భావిస్తున్నారు. ఫెర్టిలిటీ ఫ‌స్ట్ క్లినిక్ డాక్ట‌ర్ అన్నే క్లార్క్ ఈ ఘ‌ట‌న‌పై ఓ ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ క్లినిక్‌కు ఆ వ్య‌క్తి ఒక‌సారి వ‌చ్చిన‌ట్లు ఆమె తెలిపారు. కానీ అన‌ధికార ప‌ద్ధ‌తుల్లో ఆ వ్య‌క్తి త‌న స్పెర్మ్‌ను డొనేట్ చేసిన‌ట్లు ఆమె చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement