Saturday, November 23, 2024

మోదీ సాబ్.. హోంవర్క్ ఎక్కువైంది: ప్రధానికి చిన్నారి ఫిర్యాదు

పిల్లలకు స్కూలులో టీచర్స్ హోం వర్క్ ఇవ్వడం సాధారణం. ప్రతిరోజూ స్కూలులో ఇచ్చే హోం వర్కు చిన్నారులకు ఎంతో కష్టమనిపిస్తుంది. హోం వర్క్ చేయకుంటే స్కూలులో టీచర్లచే వారు దండించబడతారు. హోం వర్క్‌పై విద్యార్థులు బెట్టు చేస్తుంటారు. ఏవేవో కారణాలు చెబుతూ హోంవర్క్‌ను తప్పించుకు ప్రయత్నం చేస్తుంటారు. అయితే కశ్మీర్‌కు చెందిన ఓ చిన్నారి హోం వర్క్ గురించి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే ఫిర్యాదు చేసింది. తన బుల్లి బుల్లి మాటలతో మోదీ సాబ్ అంటూ ఆ చిన్నారి చేసిన ఫిర్యాదుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది.

‘నమస్కారం మోదీ సాబ్.. నేను అమ్మాయిని మాట్లాడుతున్నాను. నాకు ఆరేళ్ల వయసు. నేను మా జూమ్ క్లాస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చిన్న చిన్న పిల్లలకు మేడం, టీచర్లు, సార్లు ఎందుకు హోం వర్క్ ఇస్తున్నారు? ఇంత చిన్న పిల్లలు ఆ పని ఏలా చేస్తారు? నేను లేవగానే ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు క్లాస్ జరుగుతుంది. ఇంగ్లీషు, దాని తర్వాత గణితం, దాని తర్వాత ఉర్దూ, దాని తర్వాత ఈవీఎస్, దాని తర్వాత కంప్యూటర్. ఇంత పని చెప్తున్నారు చిన్న పిల్లలకు. 7, 8 చదువుతున్న వాళ్లకు ఎక్కువ హోం వర్క్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి’’ అని చిన్నారి వీడియోలో పేర్కొంది. చిన్న పిల్లలకు ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇస్తున్నారని, ఇంత హోం వర్క్ అవసరమా అంటూ ఆ చిన్నారి అడిగిన విధానం నెటిజెన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను నెటిజెన్లు తెగ షేర్ చేస్తున్నారు.

ఈ వీడియో జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా దృష్టికి అయితే వెళ్లింది. ‘‘ఈ ఫిర్యాదు చాలా ముద్దుగా ఉంది. ఈ విషయం గురించి విద్యా శాఖను ఆదేశించాను. 48 గంటల్లో విద్యా విధానం మీద ఓ పాలసీ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశాను. పిల్లకు హోం వర్క్‌ భారం ఎక్కువగా ఉండకుండా చూడాలి. బాల్యం అనేది దేవుడిచ్చిన వరం. దానిని ఆనందంగా అనుభవించనివ్వాలి. అనవసరమైన భారం వేసి ఇబ్బందిపెట్టకూడదు’’అని మనోజ్‌ సిన్హా ట్వీట్‌ చేశారు.

ఇది కూడా చదవండి :గాంధీభవన్ అటెండర్ ఇక లేరు.. ఆయనకెందుకు అంత గుర్తింపు?

Advertisement

తాజా వార్తలు

Advertisement