కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అయితే, ఈ మార్పుల వల్ల కార్ల ధరలు పెరుగుతాయని చెబుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని తయారీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ ప్రయాణికుల భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ ఒకటి నుంచి అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులను (నాలుగు సీట్లతో సహా రెండు సైడ్ ఎయిర్ బ్యాగ్‌లు) ఏర్పాటు చేయాలని జనవరిలో ప్రతిపాదించింది. కేవలం ఒక నెలలోనే వీటిపై కేంద్రం నుంచి ప్రకటన వస్తుందని అంతా భావించారు. కానీ, తయారీ సంస్థలు చెబుతోన్న కారణాలను పరిగణనలోకి తీసుకుంటోన్న ప్రభుత్వం.. వాటిని విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల అందుబాటు ధరలో దొరికే కార్లు ఖరీదుగా మారతాయని, దాని వల్ల కొనుగోలుదారులు దూరమయ్యే అవకాశముందని తయారీ సంస్థలు ఇటీవల వ్యాఖ్యలు చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వం భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement