అగ్రరాజ్యం అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. కాలిఫోర్నియాలో భూప్రకంపనలు సంభవించింది. భూకంపం తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అమెరికాలో జియోలాజికల్ సర్వే డేటా ప్రకారం ఉత్తర కాలిఫోర్నియా తీరంలో 6.2 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే సునామీ ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు.
హంబోల్ట్ కౌంటీకి సమీపంలో ఉన్న కేప్ మెండోసినో వద్ద భూకంపం సంభవించినట్టు యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది. కాలిఫోర్నియాలో వచ్చిన భూ ప్రకంపనల ప్రభావం…శాన్ ఫ్రాన్సిస్కో వరకూ కన్పించిందని సమాచారం. గత 11 ఏళ్లలో ఇలాంటి భూకంపాన్ని ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. భూప్రకంపనలు భారీగా ఉండటంతో ప్రజలంతా భయభ్రాంతులై రోడ్లపైకి వచ్చారు. U.S. జియోలాజికల్ సర్వే $10 మిలియన్ల కంటే తక్కువ ఆర్థిక నష్టాలను అంచనా వేసింది. అయితే, భూకంపం వల్ల ఎటువంటి మరణాలు సంభవించలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital