Friday, November 22, 2024

Budget 2022: దేశంలో ఈ ఏడాదే 5G సేవలు!: నిర్మలా సీతారామన్

దేశంలో 5 జీ స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాది ప్రారంభమవుతుందని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 5G స్పెక్ట్రమ్‌కు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. 2025 నాటికి దేశంలోని అన్ని గ్రామాకూ ఆప్టికల్ ఫైబర్ విస్తరిస్తుందన్నారు. 2022-23లోపు 5జీ మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్‌తో సహా ప్రధాన నగరాల్లో 5G సేవలు ప్రారంభించనున్నారు.

ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, విఐ సహా అన్ని ప్రముఖ టెలికాం కంపెనీలు తమ 5G నెట్‌వర్క్‌లను వేర్వేరు ట్రయల్స్‌లో పరీక్షిస్తున్నాయి. స్పెక్ట్రమ్ వేలంపై ప్రభుత్వం టెలికాం సంస్థలతో చర్చిస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తన సిఫార్సులను టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చేసిన తర్వాత 5జీ స్పెక్ట్రమ్ వేలం జరుగుతుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement